స్టాక్‌ మార్కెట్ల రేటింగ్‌ తగ్గించిన జేపీ మోర్గాన్‌

స్టాక్‌ మార్కెట్ల రేటింగ్‌ తగ్గించిన జేపీ మోర్గాన్‌
  • ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్, భారత ఈక్విటీ మార్కెట్లపై తన అంచనాలను తగ్గించింది. గతంలో ఉన్న ‘ఓవర్‌ వెయిట్‌’ రేటింగ్‌ను ‘తటస్థం’ (న్యూట్రల్‌)గా మారుస్తున్నట్లు వెల్లడించింది. ఇతర వర్థమాన మార్కెట్లతో పోలిస్తే షేర్ల అధిక విలువలు, ఇరాన్‌ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సరఫరా ఇబ్బందుల ఫలితంగా భారత కంపెనీల ఆదాయాలపై ఒత్తిడి పడటం ఇందుకు కారణమని వివరించింది. 
  • 2026 చివరికి నిఫ్టీ-50 సూచీ లక్ష్యాలను జేపీ మోర్గాన్‌ గణనీయంగా తగ్గించింది. బేస్‌ కేస్‌ (సాధారణ స్థితి)లో నిఫ్టీ లక్ష్యాన్ని 30,000 పాయింట్ల నుంచి 10% తగ్గించి 27,000కు కుదించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram