భారతీ ఎయిర్‌టెల్‌

భారతీ ఎయిర్‌టెల్‌
  • అంతర్జాతీయంగా 65 కోట్ల మందికి పైగా చందాదార్లతో, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సేవల సంస్థగా నిలిచినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్‌ గణాంకాల ప్రకారం.. చందాదార్ల సంఖ్యా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచింది. మనదేశంతో పాటు ఆఫ్రికాలోనూ సంస్థ టెలికాం సేవలు అందిస్తోంది. 2026, మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం.. భారత్‌లో 46.4 కోట్ల మంది (36.9 కోట్ల మొబైల్, ఐఓటీ 6.7 కోట్లు, బ్రాడ్‌బ్యాండ్‌ 1.4 కోట్లు, డిజిటల్‌ టీవీ 1.6 కోట్లు, ఐపీటీవీ 24 లక్షలు), ఆఫ్రికాలోని 14 దేశాల్లో కలిపి 17.9 కోట్ల మందికి పైగా చందాదార్లు ఎయిర్‌టెల్‌కు ఉన్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram