ఐటీటీఎఫ్ ప్రపంచ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పతకం గెలిచిన భారత తొలి ప్లేయర్‌గా ఘనత సాధించింది. 2026, నవంబరు 18న పటాయా(థాయిలాండ్) లో జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్-3 సెమీఫైనల్లో ఆమె 9-11, 11-6, 7-11, 5-11తో కార్లోటా రగాజిని (ఇటలీ) చేతిలో ఓడి, కాంస్యంతో సరిపెట్టుకుంది.