డబ్ల్యూటీఏ

డబ్ల్యూటీఏ

రష్యాకు చెందిన మిరా ఆండ్రీవా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ విజేతగా నిలిచింది. 2026, నవంబరు 16న ఇండియన్‌ వెల్స్‌ (అమెరికా)లో జరిగిన ఫైనల్లో ఆమె 7-5, 6-3తో స్వితోలినా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. 19 ఏళ్ల ఆండ్రీవా.. టోర్నీలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ గెలుచుకోవడం విశేషం. మ్యాచ్‌లో ఆమె రెండు ఏస్‌లు, 19 విన్నర్లు కొట్టింది. ఈ విజయంతో ఒక ర్యాంకు మెరుగుపర్చుకున్న ఆండ్రీవా.. కెరీర్‌లోనే అత్యుత్తమంగా రెండో స్థానానికి ఎగబాకింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram