అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మరో రెండేళ్ల కాలానికి షాను ఛైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ఐసీసీ 2026, నవంబరు 16న ప్రకటించింది. గతంలో బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరించిన షా.. 2024 డిసెంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా షా రికార్డు సృష్టించాడు.