టీ20ల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడిగా భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (15 ఏళ్ల 232 రోజులు) రికార్డు సృష్టించాడు. 2026, నవంబరు 14న ఇందౌర్‌లో ఆరంభమైన ముస్తాక్ అలీ టోర్నీలో సౌరాష్ట్రతో తలపడిన బిహార్ జట్టుకు అతడు సారథ్యం వహించాడు. దీంతో జాక్ వక్సుచ్ (క్రొయేషియా, 17 ఏళ్ల 311 రోజులు) గత సంవత్సరం సైప్రస్‌తో మ్యాచ్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.