డాకర్ యూత్ ఒలింపిక్స్ 2026లో భారత బాక్సర్లు అంబేకర్, గుంజన్ స్వర్ణ పతకాలు నెగ్గారు. 2026, నవంబరు 12న డాకర్ (సెనెగల్)లో జరిగిన పురుషుల 50 కేజీల విభాగం ఫైనల్లో అంబేకర్ 3-2తో క్రిస్టియన్ జుబాని (ఐర్లాండ్)ను ఓడించి, పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 2010లో యూత్ ఒలింపిక్స్ బాక్సింగ్‌లో శివ థాపా ఫైనల్ చేరినా.. రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇదే క్రీడల్లో వికాస్ క్రిషన్ కాంస్యం సాధించాడు. అంబేకర్‌ది మణిపుర్‌లోని లామ్‌లయ్ లెకయ్ గ్రామం.
మహిళల 48 కేజీల తుది పోరులో గుంజన్ 5-0తో బౌతైనా బెన్సాలా (అల్జీరియా)ను ఓడించింది. యూత్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ స్వర్ణం గెలిచిన భారత తొలి అమ్మాయిగా ఈ 17 ఏళ్ల హరియాణా అమ్మాయి ఘనత సాధించింది.