తెలంగాణ ఆతిథ్యమివ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. 2026, డిసెంబరు 11న ప్రారంభమయ్యే 12 రోజుల పండగలో 27 క్రీడాంశాలతో పాటు సెయిలింగ్ ప్రదర్శన క్రీడగా ఉంటుందని మాండవీయ నవంబరు 9న ప్రకటించారు. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి క్రీడల సముదాయంతో సహా హైదరాబాద్‌లోని పలు స్టేడియాల్లో 22 క్రీడల పోటీల్ని నిర్వహించనున్నారు.