భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల కమిషన్ ఛైర్‌పర్సన్‌గా స్టార్ షట్లర్ పి.వి.సింధు.. వైస్ చైర్మన్‌గా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ఐఓఏ సర్వసభ్య సమావేశానికి అథ్లెట్ల కమిషన్ ప్రతినిధులుగా ఎంపికయ్యారు.
ఈ నలుగురు క్రీడాకారులు 2026-2030 కాలానికి గాను నాలుగేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.