భారత టెన్నిస్ స్టార్లు మహేశ్ భూపతి, సానియా మీర్జా.. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పాలక మండలిలో చోటు దక్కించుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) ఎన్నికలో భూపతికి 23 ఓట్లు రాగా.. సానియాకు 18 మంది ఓటేశారు. అంతకుముందు ఐటా సర్వసభ్య ఎన్నికల్లో వీరిద్దరూ స్పోర్ట్స్‌పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్ (ఎస్‌ఓఎమ్) ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇక్కడ మహేశ్ 19, సానియా 18 ఓట్లు దక్కించుకున్నారు. అశుతోష్ సింగ్ (17 ఓట్లు), షాలిని ఠాకూర్ చావ్లా (16) మిగతా రెండు స్థానాల్ని పొందారు. సవరించిన ఐటా నిబంధనల ప్రకారం ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలకు ఎస్‌ఓఎమ్ ప్రతినిధులుగా అవకాశం లభిస్తుంది.