అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై

ఫుట్‌బాల్‌ చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. 23 ఏళ్ల పాటు పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో... 234 మ్యాచ్‌ల్లో 146 గోల్స్‌ కొట్టాడు. ఇప్పట్లో మరో ఫుట్‌బాలర్‌ అతణ్ని అందుకునే అవకాశం లేదు.

  • రొనాల్డో 18 ఏళ్ల వయసులో, 2003లో పోర్చుగల్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 2026, సెప్టెంబరులో వేల్స్‌తో ఆడిన మ్యాచ్‌ కెరీర్‌లో అతడికి చివరిది. రొనాల్డో క్లబ్‌ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం అతడు అల్‌ నాసిర్‌ క్లబ్‌ (సౌదీ అరేబియా)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram