యూత్ ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత తొలి వుషు ప్లేయర్‌గా లాంచెంబి చాను రికార్డు సృష్టించింది. 2026, నవంబరు 3న డాకర్ (సెనెగల్)లో జరిగిన మహిళల చాంగ్‌క్వాన్ కంబైన్డ్ ఈవెంట్లో ఆమె కాంస్యం సాధించింది. మణిపుర్‌కు చెందిన లాంచెంబి 18.039 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. సొండోస్ (18.660, ఈజిప్ట్) స్వర్ణం, వలేరియా (18.199, వెనెజువెలా) రజతం గెలిచారు.