ఎఫ్‌-1 ఛాంపియన్‌

ఎఫ్‌-1 ఛాంపియన్‌

ఫార్ములావన్‌ ఛాంపియన్‌గా నిలిచిన పిన్న వయస్కుడైన రేసర్‌గా 20 ఏళ్ల ఆంటోనెలి (మెర్సీడెజ్‌) చరిత్ర సృష్టించాడు. జర్మనీ స్టార్‌ సెబాస్టియన్‌ వెటల్‌ (23 ఏళ్లు; 2010లో) పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. ఈ సీజన్లో ఇప్పటిదాకా తొమ్మిది రేసుల్లో గెలిచిన ఆంటోనెలి.. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఓడాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) విజేతగా నిలిచాడు. పోల్‌ పొజిషన్‌ నుంచి రేసు మొదలుపెట్టిన ఫెరారీ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. డ్రైవర్‌ స్టాండింగ్స్‌లో 380 పాయింట్లతో ఉన్న ఆంటోనెలి.. ఈ సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే ఎఫ్‌-1 కిరీటాన్ని సొంతం చేసుకున్నాడు

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram