యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన జూడోకా ఖుష్బూ రజక్‌భాయి రజతం సాధించగా.. స్విమ్మర్ ధినిధి దేసింగు కాంస్యం గెలిచింది. 2026, నవంబరు 2న డాకర్ (సెనెగల్)లో జరిగిన జూడో మహిళల 63 కేజీల విభాగంలో 15 ఏళ్ల ఖుష్బూ.. క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్ జోలినా రీన్‌హోల్డ్ (జర్మనీ) చేతిలో పరాజయం పాలైంది. ఈ పోటీ 48 సెకన్లలోనే ముగిసింది.
మరోవైపు బెంగళూరుకు చెందిన 16 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ రేసులో మూడో స్థానం సాధించింది. ఆమె 56.27 సెకన్లలో పూర్తి చేసింది. అనా బొబనోవిచ్ (55.89 సె) స్వర్ణం, క్రొయేషియా), అలీసా (న్యూజిలాండ్ (56.13 సె) రజతం గెలిచారు.