భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. 2026, నవంబరు 1న సార్‌బ్రూకెన్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-12, 21-14తో ప్రపంచ 25వ ర్యాంకు క్రీడాకారిణి లీనె కైర్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. సింధుకు ఈ సీజన్లో ఇది రెండో టైటిల్. 2026, జులైలో ఆమె జపాన్ ఓపెన్ గెలిచింది.
మరోవైపు లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు 21-17, 21-10తో జోనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.