ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ కేన్.. ఫుట్‌బాల్ ఉత్తమ ఆటగాడికిచ్చే బాలన్‌డోర్ అవార్డు దక్కించుకున్నాడు. గత సీజన్లో ఇంగ్లాండ్, తన క్లబ్ బయన్ మ్యూనిక్ తరఫున కేన్ 65 మ్యాచ్‌ల్లో 73 గోల్స్ కొట్టాడు. ఓటింగ్‌లో ఎంబాపె (ఫ్రాన్స్), లామైన్ యమాల్ (స్పెయిన్), లియొనల్ మెస్సి (అర్జెంటీనా)లను వెనక్కి నెట్టి కేన్ ఈ అవార్డు సాధించాడు. 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ఇంగ్లాండ్ ఆటగాడికి బాలన్‌డోర్ దక్కడం విశేషం. చివరగా 2001లో మైకేల్ ఒవెన్ ఈ అవార్డును పొందాడు.