భారత స్టార్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యుకి బాంబ్రి .. ర్యాన్ సెగర్‌మాన్ (అమెరికా)తో కలిసి ఆల్మాటీ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ సీజన్లో యుకికి ఇదే తొలి టైటిల్. 2026, అక్టోబరు 25న ఆల్మాటీలో జరిగిన పురుషుల డబుల్స్‌లో యుకి ద్వయం 7-6 (7-3), 6-7 (1-7), 10-2తో టాప్ సీడ్ లూకస్ మెడ్లర్, నీల్ ఒబలీట్నర్ (ఆస్ట్రేలియా) జంటకు షాకిచ్చింది. మొత్తంగా యుకి జోడీ ఆల్మాటీ టైటిల్ నెగ్గడం ఇది అయిదోసారి.