బోధన

బోధన

భారత సంతతికి చెందిన చెస్‌ క్రీడాకారిణి బోధన శివానందన్‌ మరో రికార్డు బద్దలు కొట్టింది. కొద్ది రోజుల కిందట 11 ఏళ్లకే మహిళా గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న ఆమె.. ఇప్పుడు అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎమ్‌) హోదా కూడా పొందింది. అతిపిన్న వయసులో ఈ హోదా అందుకున్న ప్లేయర్‌గా ఘనత సాధించింది. ఈ క్రమంలో 38 ఏళ్ల క్రితం జుడిత్‌ పోల్గర్‌ (హంగేరి) నెలకొల్పిన రికార్డును బోధన తిరగరాసింది. యూరోపియన్‌ మహిళల చెస్‌ క్లబ్‌ కప్‌ ఆఖరి రౌండ్లో ఐఎమ్‌కు కావాల్సిన 2400 రేటింగ్‌ పాయింట్ల మార్కును బోధన చేరుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram