పారా ఆసియా క్రీడలు

పారా ఆసియా క్రీడలు

నగోయా (జపాన్‌) పారా ఆసియా క్రీడలు 2026, అక్టోబరు 24న ముగిశాయి. 114 పతకాలతో (30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు) భారత్‌ ఈ క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా నాలుగో స్థానం సాధించింది. చైనా 435 పతకాలతో (207 స్వర్ణాలు, 117 రజతాలు, 111 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలవగా.. జపాన్‌ 186 (64 స్వర్ణాలు, 60 రజతాలు, 62 కాంస్యాలు), ఉజ్బెకిస్థాన్‌ 145 (45 స్వర్ణాలు, 49 రజతాలు, 51 కాంస్యాలు) పతకాలతో తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. కొరియా (29 స్వర్ణాలు, 38 రజతాలు, 33 కాంస్యాలు) 5వ స్థానంలో నిలిచింది. పారా ఆసియా క్రీడలు 2026, అక్టోబరు 18న ప్రారంభమయ్యాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram