పారా ఆసియా క్రీడలు

పారా ఆసియా క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో 2026, అక్టోబరు 22న భారత్‌ 7 స్వర్ణాలు, 5 రజతాలు సహా 26 పతకాలు గెలుచుకుంది. పురుషుల హైజంప్‌ (టీ63)ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. క్రీడల రికార్డు (1.89మీ)తో శైలేశ్‌ కుమార్‌ స్వర్ణం నెగ్గగా.. వరుణ్‌ భాటి (1.84మీ) రజతం, రాహుల్‌ (1.81మీ) కాంస్యం సాధించారు.

  • మరోవైపు స్ప్రింటర్‌ దిలీప్‌ గవిత్‌ డబుల్‌ సాధించాడు. 100మీ పరుగులో అక్టోబరు 21న విజేతగా నిలిచిన అతడు.. ఇప్పుడు 400మీ (టీ47) పరుగులో కూడా పసిడి నెగ్గాడు. అతడు 48.27 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు.

  • మహిళల 400మీ (టీ47)లో అంజనాబెన్‌ బూంబాడియా స్వర్ణం గెలిచింది. 59.97 సెకన్ల టైమింగ్‌తో ఆమె అగ్రస్థానంలో నిలవగా.. భారత్‌కే చెందిన జయంతి బెహ్రా (1:00.65సె) రజతం సొంతం చేసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram