పారా ఆసియా క్రీడల్లో భారత్ 2026, అక్టోబరు 21 నాటికి మొత్తం 62 పతకాలతో అయిదో స్థానంలో నిలిచింది. ఇందులో 14 స్వర్ణాలు, 22 రజతాలు, 26 కాంస్యాలు ఉన్నాయి.
పారా అథ్లెటిక్స్‌లో రన్నర్ సిమ్రన్ శర్మ రెండు స్వర్ణాలు నెగ్గింది. మహిళల 100మీ (టీ12), 200మీ (టీ12)లో ఆమె విజేతగా నిలిచింది. గేమ్స్ రికార్డు టైమ్ (12.02సె)తో ఆమె 100మీ రేసులో విజేతగా నిలిచింది. 24.80 సెకన్ల టైమింగ్‌తో సిమ్రన్ 200మీ పసిడి చేజిక్కించుకుంది. సిమ్రన్.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.
నిషాద్ కుమార్ కూడా డబుల్ సాధించాడు. అక్టోబరు 20న లాంగ్‌జంప్‌లో విజేతగా నిలిచిన అతడు.. అక్టోబరు 21న హైజంప్ (టీ47)లో 2.04 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నాడు.