డైమండ్ లీగ్ జ్యూరిచ్ అంచెలో రెండు ఈవెంట్లలో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. అలిసన్ డాస్ సాంటోస్ (బ్రెజిల్), మసాయ్ రసెల్ (అమెరికా) తాము పోటీపడిన హర్డిల్స్ విభాగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో సాంటోస్ 45.80 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ క్రమంలో కార్టెన్ వార్‌హోమ్ (నార్వే) 2021 టోక్యో ఒలింపిక్స్ వేదికగా నెలకొల్పిన రికార్డు (45.94 సె)ను అతడు బద్దలు కొట్టాడు.