బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా సింధు

బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా సింధు

భారత దిగ్గజ షట్లర్‌ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) కౌన్సిల్‌ సభ్యురాలిగా 2026, ఏప్రిల్‌ 27న బాధ్యతలు చేపట్టింది. బ్యాడ్మింటన్‌ కోర్టులో చురుకైన క్రీడాకారిణిగా ఉంటూనే.. ప్రపంచ స్థాయి నిర్ణయాధికార కమిటీలో ఓటు హక్కు కలిగిన సభ్యురాలిగా సింధు ఎంపికవడం అరుదైన ఘనతే. 2025, డిసెంబరులో బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన సింధు.. ఆ పదవి ద్వారా కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్‌ సభ్యత్వాన్ని పొందింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram