ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు స్వర్ణం నెగ్గింది. 2026, ఏప్రిల్ 11న ప్యూబ్లాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు 233-232తో అమెరికా (డీన్ ఒలీవియా, పియర్స్ పేజ్, రూయిజ్ అలెక్సిస్)పై విజయం సాధించింది. ప్రపంచకప్‌లో మొత్తంగా జ్యోతికి ఇది 12వ స్వర్ణం.