భారత క్రికెట్ దిగ్గజం, టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రికి సొంత మైదానం వాంఖడేలో సముచిత గౌరవం దక్కింది. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టింది. భారత మాజీ క్రికెటర్లు ఏక్‌నాథ్ సోల్కర్, దిలీప్ సర్దేశాయ్, మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీలను కూడా ఎంసీఏ గౌరవించింది. వాంఖడే స్టేడియంలోని గేట్లకు వారి పేర్లను పెట్టింది.