సింథటిక్‌ షటిల్స్‌ 

సింథటిక్‌ షటిల్స్‌ 
  • పర్యావరణ పరిరక్షణతో పాటు బ్యాడ్మింటన్‌లో సుస్థిరత లక్ష్యంగా సహజసిద్ధమైన పక్షి ఈకల షటిల్స్‌కు బదులుగా కృత్రిమ (సింథటిక్‌) కాక్‌లను ప్రవేశపెట్టాలని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్ణయించింది. తొలుత చిన్న స్థాయి (గ్రేడ్‌-3) టోర్నీలు, జూనియర్‌ అంతర్జాతీయ పోటీలలో వీటిని పరీక్షించనుంది. గాలిలో ఈ షటిల్స్‌ ప్రయాణించే తీరు, వేగం, నాణ్యత, క్రీడాకారుల నియంత్రణ వంటి అంశాలు ప్రస్తుత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఈ పరీక్షల్లో నిశితంగా పరిశీలించనుంది. క్రీడాకారుల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తులో ప్రధాన టోర్నీలలో సింథటిక్‌ షటిల్స్‌ వాడకంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram