సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు తీర్పు
  • క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ, పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2025 ఏప్రిల్‌ 30న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం 2026, మార్చి 24న తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాలవారూ ఎస్సీల కిందికి రారని స్పష్టం చేసింది. ఈ మూడు మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారినవారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారని పేర్కొంది.
  • షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 2025, ఆగస్టు 26న విచారణ ముగించి తీర్పు రిజర్వ్‌ చేసింది. మార్చి 24న దాన్ని వెలువరించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram