ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు వైద్య సేవలు, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘కార్మిక రాజ్య బీమా నిబంధనలు-2026’ రూపొందించింది. సామాజిక భద్రత కోడ్ అమల్లో భాగంగా ప్రస్తుత ఈఎస్‌ఐసీ-1950 నిబంధనల స్థానంలో నవంబరు 20 నుంచి ‘2026 నిబంధనల’ను అమల్లోకి తీసుకొచ్చింది.
కార్మికులకు ఈఎస్‌ఐ గుర్తింపు కార్డు జారీ నుంచి క్లెయిమ్‌ల దాఖలు, ప్రయోజనాల చెల్లింపులన్నీ ఆన్‌లైన్లో చేయనుంది. అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాల కోసం ప్రత్యేక క్లెయిమ్‌లు అవసరం లేకుండా వైద్య ధ్రువీకరణ, యజమాని క్లెయిమ్ ఆధారంగా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.
ఈఎస్‌ఐ గుర్తింపు నంబరుకు ఆధార్, ఆధార్ అనుసంధాన బ్యాంకు ఖాతా తప్పనిసరి చేసింది. కొత్తగా చేరిన ఉద్యోగులు కనీసం తొమ్మిదినెలల చందాకాలం పూర్తయిన తరువాతే ఈఎస్‌ఐ ప్రయోజనాలకు అర్హులు కానున్నారు.