కార్మిక రాజ్యబీమా సంస్థ పరిధిలో సభ్యుడిగా చేరేందుకు కార్మికులు, ఉద్యోగుల వేతన పరిమితిని కేంద్ర కార్మికశాఖ ఖరారు చేసింది. సామాజిక భద్రత కోడ్‌కు అనుగుణంగా సాధారణ ఉద్యోగులు నెలకు రూ.21వేలు, దివ్యాంగ ఉద్యోగులు రూ.25 వేలలోపు వేతనం పొందుతుంటే ఈఎస్‌ఐలో సభ్యులు అవుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రకార్మిక శాఖ..ఈ నిబంధనలు నవంబరు 21 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.