ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) 57వ వేడుకలు 2026, నవంబరు 20న గోవాలో మొదలయ్యాయి. నవంబరు 28 వరకు జరగనున్న ఈ చిత్రోత్సవాల్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. వేడుకలో భారతీయ చిత్రాలతో పాటు 86 దేశాల నుంచి 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలు ప్రదర్శిస్తారు.