ఇఫి

ఇఫి
  • 2026, నవంబరు 20 నుంచి 28 వరకు జరిగే ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’(ఇఫి) 57వ వేడుకలను ‘సరిహద్దులు లేని కథలు’ అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. 86 దేశాల నుంచి వచ్చిన 159 అంతర్జాతీయ, 76 భారతీయ చిత్రాలు ప్రదర్శిస్తారు. ప్రముఖ పోలిష్‌ దర్శకుడు పావెల్‌ పావ్లీకోవ్స్కీ తెరకెక్కించిన ‘ఫాదర్‌ల్యాండ్‌’ చిత్రంతో ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు.

  • 137 దేశాల నుంచి 1400 చిత్రాలు దరఖాస్తులు చేసుకోగా తొమ్మిది ప్రపంచ ప్రీమియర్లు, రెండు అంతర్జాతీయ, 24 ఆసియా, 116 భారతీయ, 14 గాలా ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు. ఇండియన్‌ పనోరమా విభాగంలో 18 భాషలకు చెందిన 76 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఫీచర్‌ చిత్రాల విభాగాన్ని ‘ధురంధర్‌’, నాన్‌ ఫీచర్‌ విభాగాన్ని లదాఖీ భాషా సినిమా ‘బికమింగ్‌’ చిత్రాలతో ప్రారంభించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram