భారత్‌ వీసా ప్రక్రియ

భారత్‌ వీసా ప్రక్రియ
  • భారతీయ వీసాల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విదేశీయులకు కేటాయించే వీసా కేటగిరీలను 13 నుంచి 9కి తగ్గించింది. సబ్‌ కేటగిరీలను 49 నుంచి 23కు తగ్గించింది. వీసా దరఖాస్తు ఫారంలోని 65-70శాతం అంశాలను ఎత్తివేసింది. కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 9 కేటగిరీల్లో వ్యాపారం, దౌత్యం, ఉపాధి, పాత్రికేయం, వైద్యం, అధికారికం, విద్యార్థి, విజిటర్, తదితరాలున్నాయి.

  • టూరిస్టు వీసాను విజిటర్‌ వీసాగా ప్రభుత్వం మార్చింది. దీన్ని రెండు సబ్‌ కేటగిరీల కింద చేర్చి.. వీ-1, వీ-2గా వర్గీకరించింది.

  • వీ-1 వీసా స్వల్పకాలానికి మంజూరు చేస్తారు. వ్యాపార సమావేశాలకు వచ్చేవారు, వైద్య సంప్రదింపులకు వచ్చేవారు, వెల్‌నెస్‌ రిట్రీట్‌ కోసం వచ్చేవారు, స్వల్పకాల వైద్య చికిత్సలకు వచ్చేవారు, భారతీయ భాషల్లో స్వల్పకాల కోర్సులను చేసేందుకు వచ్చేవారు, సంగీతం, కళ, క్రాఫ్ట్‌లను నేర్చుకునేందుకు వచ్చే వారికి ఈ వీసాలను ఇస్తారు. ఈ వీసాను 30 రోజులకు మల్టిపుల్‌ ఎంట్రీలతో అందజేస్తారు.

  • వీ-2 వీసాను దీర్ఘకాలం ఉండేవారి కోసం ఇస్తారు. దీని కాలపరిమితి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్లు, పదేళ్లుగా ఉంటుంది. ఈ వీసాతో వీ-1 కింది ఉండే అనుమతులతోపాటు పర్వతారోహణ కోసం వచ్చే వారికి ఇస్తారు. పర్వతారోహకులకు 6 నెలల మల్టిపుల్‌ ఎంట్రీ వీసా ఇస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram