సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు తీర్పు
  • తాత తన ఆస్తిని పిల్లలకు పంచిన తర్వాత ఆ ఆస్తిపై సర్వహక్కులు వారికే లభిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. తండ్రికి అలా లభించిన ఆ ఆస్తిపై మనవడికి జన్మతఃహక్కు ఉండదని జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ల ధర్మాసనం 2026, నవంబరు 10న తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం-1956లోని సెక్షన్‌ 8ని ఉటంకించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 6, 29(ఎ).. తాత ఆస్తిని కోరుతూ మనవడు దాఖలు చేసిన ప్రస్తుత వ్యాజ్యానికి వర్తించవని స్పష్టం చేసింది.

  • అవిభాజ్య హిందూ కుటుంబ ఆస్తులపై వీలునామా రాయకుండా యజమాని మరణించిన సందర్భాల్లో తలెత్తే వివాదాలు ప్రస్తుత వ్యాజ్యానికి భిన్నమైనవని అభిప్రాయపడింది. పిటిషనర్‌ కేసులో మద్రాస్‌ హైకోర్టు వెలువరించిన నిర్ణయంతో ఏకీభవించింది. తన తండ్రి విక్రయించిన ఆ ఆస్తిలో వాటా కావాలంటూ తల్లి సంరక్షణలో ఉన్న మైనర్‌ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram