మహాభారతం, కౌటిల్యుడి అర్ధశాస్త్ర, 12వ శతాబ్ది నాటి రాజతరంగిణి రాత ప్రతులకు యునెస్కో ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ రిజిస్టర్‌లో చోటు లభించింది. జకార్తాలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇదొక చరిత్రాత్మక గుర్తింపు అని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ పరిణామం మన దేశానికెంతో గర్వకారణమని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ పేర్కొన్నారు.