హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ(మేనేజ్)ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌డీఈ) వ్యవసాయ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్- స్కిల్స్‌గా గుర్తింపునిచ్చింది. దిల్లీలోని కౌశల్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ మేనేజ్‌కు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్- స్కిల్స్ గుర్తింపు మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.