కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

అగ్నిపథ్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న అగ్నివీర్‌లందరినీ ఇక నుంచీ వారందరినీ సైన్యంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే 25శాతం మందిని ప్రతిభ ఆధారంగా సైన్యంలోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. మిగిలిన 75శాతం మందికీ ఆ అవకాశం కల్పించాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు తొలుత రెండేళ్ల పొడిగింపు ఇవ్వనుంది. ఆ తర్వాత వారి అర్హతలను పరిగణనలోకి తీసుకుని సైన్యంలో చేరే ఆప్షన్‌ను వారికే ఇవ్వనుంది. దీంతో ఆసక్తి ఉన్న ప్రతి అగ్నివీర్‌ త్రివిధ దళాల్లో చేరవచ్చు. 2026, నవంబరు 4న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram