జనగణనలో ముఖ్యమైన జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని 2027, జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 2026, అక్టోబరు 30న జారీచేశారు. ఇందులో రివిజనల్ రౌండ్ మార్చి 1 నుంచి మార్చి 5వరకు ఉంటుంది.
తొలిసారి స్వీయగణన అవకాశాన్ని తీసుకొచ్చిన కేంద్రం.. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్లో సొంతంగా నమోదు చేసేందుకు జనవరి 10 నుంచి 24వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. 2027 మార్చి 1వ తేదీ 00.00 గంటలను దీనికి ప్రాతిపదిక తేదీ (రెఫరెన్స్ డేట్)గా నిర్ణయించినట్లు పేర్కొంది.