సైనిక దళాల ఆధునికీకరణకు ఊతమిస్తూ రూ.2.12 లక్షల కోట్ల ఆయుధ సమీకరణకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. ఇందులో బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లు, రాడార్లు తదితరాలు ఉన్నాయి. వీటి కొనుగోలు ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశం 2026, అక్టోబరు 26న నిర్ణయం తీసుకుంది. ఈ ఆయుధ వ్యవస్థల్లో 82 శాతాన్ని భారత పరిశ్రమల నుంచే సమీకరిస్తారు.
ఆర్మీ కోసం హై మొబిలిటీ వెహికల్స్ (హెచ్‌ఎంవీలు), సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రాక్డ్ గన్ సిస్టమ్, గన్ షూట్ రెస్పాన్స్ సిస్టమ్ (జీఎస్‌ఆర్‌ఎస్), తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీషోరడ్స్), కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ (సీ-యూఏఎస్), మానవరహిత వైమానిక వ్యవస్థలు, గగనతల నిఘా విమానాలు, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ స్ట్రైక్ సిస్టమ్, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్ వ్యవస్థలను సేకరిస్తారు.