ఓపియం పంటకూ లైసెన్స్‌

ఓపియం పంటకూ లైసెన్స్‌

డ్రగ్స్‌గా పరిగణించే ఓపియం పాపీ(నల్లమందు) పండించడానికి అవసరమైన లైసెన్స్‌ల జారీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. 2026, అక్టోబరు 1 నుంచి 2027, సెప్టెంబరు 30 వరకు ఉండే ‘ఓపియం క్రాప్‌ ఇయర్‌ లైసెన్సు’ల జారీ కోసం కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని రెవిన్యూ విభాగం ‘నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ రూల్స్‌-1985’ కింద ఈ ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 పంటకాలంలో హెక్టార్‌కు 800 కిలోలకు మించి ఓపియం పండించిన వారికే ఈ లైసెన్స్‌ జారీచేస్తారు. అంతకంటే తక్కువ పండించిన వారిని 2026-27లో లైసెన్స్‌ పొందకుండా సస్పెండ్‌ చేస్తున్నారు. అర్హత సాధించిన ప్రతి సాగుదారుకు 0.05 హెక్టార్లలో ఈ పంట పండించడానికి లైసెన్స్‌ ఇస్తారు. తొలిసారి ఇప్పుడు ఒకేసారి 5 ఏళ్ల కాలానికి లైసెన్స్‌ జారీ చేస్తున్నారు. సాగుదారులు అక్రమాలకు పాల్పడకపోతే ఇప్పుడు ఇచ్చే లైసెన్స్‌ 2030-31 వరకు కొనసాగుతుంది. ఇక్కడ పండించే ఓపియం పాపీ ధర ఎంతన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ధారిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram