సివిల్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌

సివిల్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌

యుద్ధ పరిణామాలు, డ్రోన్‌ దాడులు, భారీ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల లాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలను కూడా సిద్ధం చేసేందుకు కేంద్రం ‘సివిల్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌’ను రూపొందించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ భారత సైన్యంతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతుంది. తొలిసారిగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 60 వేలమంది సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్లకు శిక్షణ అందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటిదశలో 600 మంది సివిల్‌ డిఫెన్స్‌ మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 50 మంది చొప్పున ఎంపికచేసి మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. నవంబరు రెండో వారం నాటికి ఈ శిక్షణ పూర్తిచేయాలన్నది లక్ష్యం.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram