‘కిసాన్‌ మిత్ర ఛడీ’

‘కిసాన్‌ మిత్ర ఛడీ’
  • రైతులు విషసర్పాల బారి నుంచి తప్పించుకునేలా భారత శాస్త్రవేత్తలు ‘కిసాన్‌ మిత్ర ఛడీ’ పేరుతో ఒక స్మార్ట్‌ చేతికర్రను రూపొందించారు. దీన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఇటీవల ఆవిష్కరించారు. పాములు కోల్డ్‌-బ్లడెడ్‌ జంతువులు. వాటి శరీర ఉష్ణోగ్రత, కదలికలు.. పరిసరాలకు భిన్నంగా ఉంటాయి. వీటిని పసిగట్టి, రైతును అప్రమత్తం చేయడం కిసాన్‌ మిత్ర ఛడీ ప్రత్యేకత. ఇది చూడటానికి.. సాధారణ చేతి కర్రలా ఉంటుంది. అయితే అందులో అనేక సెన్సర్లు, హెచ్చరిక వ్యవస్థలు ఉంటాయి. 
  • ఈ కర్రను నేలపై ఉంచి, అందులోని బటన్‌ను నొక్కాలి. వెంటనే ఈ సాధనం.. 100 మీటర్ల పరిధి వరకూ పరిసరాలను స్కాన్‌ చేస్తుంది.  పాము ఉనికికి సంబంధించిన భిన్న సంకేతాలను ఇది పరిశీలిస్తుంది. పాము ఉనికిని గుర్తిస్తే ఈ కర్ర.. వైబ్రేషన్‌ మోడ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ తరహాలో కంపిస్తుంది. తద్వారా రైతు ముందే అప్రమత్తం కావడానికి వీలవుతుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram