ఆసియా జౌళి సదస్సు

 ఆసియా జౌళి సదస్సు
  • హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో 2026, ఏప్రిల్‌ 3న ఆసియా జౌళి సదస్సు-2026 జరిగింది. భారత జౌళి రంగానికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని.. 2030కి మార్కెట్‌ విలువ 350 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.32.55 లక్షల కోట్ల)కు చేరుతుందని, అందులో వంద బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.9.30 లక్షల కోట్ల) ఎగుమతులుంటాయని భారత జౌళి పరిశ్రమల సమాఖ్య (సీఐటీఐ) వెల్లడించింది. చైనా, బంగ్లాదేశ్‌లలో ప్రతికూలతలు కలిసొస్తాయని.. పత్తి, నూలు ఉత్పత్తుల పురోగతి, వారసత్వ కళా, వృత్తి నైపుణ్యం, శ్రమశక్తి వంటివి భారత్‌కు అదనపు బలాలని తెలిపింది. అంతర్జాతీయ టెక్స్‌టైల్‌ హబ్‌గా మనదేశం ఎదుగుతుందని పేర్కొంది. ఈ సందర్భంగా ‘ప్రపంచ జౌళి రంగానికి కొత్త భవిష్యత్తు ఆవిష్కరణ’ నివేదికను సీఐటీఐ విడుదల చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram