స్వనిధి పథకం అమలులో ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ 2026, నవంబరు 20న దిల్లీలో ‘స్వనిధి సమ్మాన్ అవార్డ్-2026’లు ప్రదానం చేశారు. వీధి వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం 2020 జూన్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ ఏడు అవార్డులు కైవసం చేసుకొంది.
బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫాస్టెస్ట్ మూవర్ విభాగంలో తెలంగాణకు ఒక అవార్డు దక్కింది.