స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 అవార్డులు

ఆంధ్రప్రదేశ్‌:

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025-26 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆరింటిని కైవసం చేసుకొంది. 10 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీ నగరాల్లో విశాఖపట్నం తొలి ర్యాంకు సాధించింది. స్వచ్ఛ నగరాల లీగ్‌లో విజయవాడ 3వ ర్యాంకు, 3-10 లక్షల జనాభా కేటగిరీ నగరాల్లో గుంటూరు 3వ ర్యాంకు, ఈ ఏడాది తొలిసారి ప్రవేశపెట్టిన గురు-శిష్య (మెంటార్‌-మెంటీ) సిటీ విభాగంలో తిరుపతి, కుప్పంలు 3వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. రాష్ట్రస్థాయిలో తొలి స్వచ్ఛ నగరంగా రాజమహేంద్రవరం నిలిచింది.

తెలంగాణ:

తెలంగాణలో ఉత్తమ స్వచ్ఛనగరంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిలిచింది. జాతీయస్థాయిలో మెంటార్‌-మెంటీ సిటీస్, స్వచ్ఛ నగరాల లీగ్, 10 లక్షలకుపైగా, 3 నుంచి 10 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షలు, 20 వేల నుంచి 50 వేలు, 20 వేల లోపు జనాభా, నదీ, సముద్రతీరం, హిమాలయప్రాంత నగరాల కేటగిరీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన పట్టణ స్థానిక సంస్థలకు రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. అర్హత ఉన్న విభాగాల్లో.. ఏ కేటగిరీలోనూ తెలంగాణ తొలి మూడు ర్యాంకులను దక్కించుకోలేకపోయింది. రాష్ట్రస్థాయి ఉత్తమ నగరాల్లో... తెలంగాణలో జీహెచ్‌ఎంసీ తొలిస్థానంలో నిలిచింది.

2026, నవంబరు 11న న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram