తెలంగాణ బొగ్గు గనులకు ‘5-స్టార్‌’ అవార్డులు

తెలంగాణ బొగ్గు గనులకు ‘5-స్టార్‌’ అవార్డులు

తెలంగాణలోని జెన్‌కో, సింగరేణికి చెందిన ఆరు బొగ్గు గనులకు జాతీయస్థాయిలో 5-స్టార్‌ రేటింగ్‌ అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్‌ చంద్ర దూబే చేతుల మీదుగా 2026, నవంబరు 2న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్, జెన్‌కో డైరెక్టర్‌ నాగ్యా అవార్డులు స్వీకరించారు. సింగరేణికి చెందిన శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి ఏరియాకు చెందిన జేవీఆర్‌ ఓసీ-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరిగూర ఓసీ, రామగుండం-3కి చెందిన ఆర్‌జీ ఓసీ-1 గనులతోపాటు జెన్‌కోకు చెందిన తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనికి 2024-25 సంవత్సరానికి 5-స్టార్‌ రేటింగ్‌ అవార్డులు లభించాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram