పోలవరం

పోలవరం
  • ఆసియాలోనే జంబో టర్బైన్ల సాంకేతికతతో నిర్మించనున్న అతి పెద్ద జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు (పీహెచ్‌ఈపీ) నిలవనుంది. తక్కువ హెడ్‌ (నీరు పడే ఎత్తు)తోనే అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్కటి 80 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 12 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్తులో 960 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.
  • ప్రాజెక్టులో వినియోగించే టర్బైన్లు, జనరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్‌ పరికరాలను భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) సరఫరా చేస్తోంది. 2027 జులైలో జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి కనీసం మూడు యూనిట్లు ప్రారంభించాలని, 2028 జనవరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ జెన్‌కో లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram