తాడ్మెట్లలో భారీ స్తూపం

తాడ్మెట్లలో భారీ స్తూపం
  • ఛత్తీస్‌గఢ్‌లోని తాడ్మెట్లలో అమరజవాన్లకు గుర్తుగా నిర్మించిన భారీ స్మారక స్తూపాన్ని సీఆర్పీఎఫ్‌ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్‌సింగ్‌ 2026, ఏప్రిల్‌ 6న ఆవిష్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని అప్పటి దంతెవాడ జిల్లా (ప్రస్తుత సుక్మా జిల్లా)లోని గడ్గమేట-తాడ్మెట్ల గ్రామాల మధ్య 2010 ఏప్రిల్‌ 6న అడవుల్లో జరిగిన మావోయిస్టుల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు.
  • ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ సాయుధ తిరుగుబాటు నుంచి విముక్తి పొందుతున్న తరుణంలో 16 ఏళ్ల తర్వాత జవాన్లపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు, సీఆర్పీఎఫ్‌ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram