నందకిశోర్‌ యాదవ్‌

నందకిశోర్‌ యాదవ్‌

బిహార్‌కు చెందిన ప్రముఖ షెఫ్‌ నందకిశోర్‌ యాదవ్‌.. బ్రిటన్‌ రాజ కుటుంబం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రాయల్‌ గార్డెన్‌ పార్టీకి హాజరై అరుదైన గౌరవం అందుకున్నారు. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో ఉన్న చారిత్రాత్మక ప్యాలెస్‌ ఆఫ్‌ హోలీరూడ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3, రాణి కెమిలా దంపతులు ఈ గార్డెన్‌ పార్టీకి ఆతిథ్యమిచ్చారు. రాజ కుటుంబీకుల వేసవి క్యాలెండర్‌లో ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమంగా భావిస్తారు. సంప్రదాయం ప్రకారం.. రాజు ప్రతి సంవత్సరం వేసవిలో ఒక వారంపాటు స్కాట్లాండ్‌ కోటలో గడుపుతారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram