సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం

సీఈ20 క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరీక్ష విజయవంతం
  • భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌-సీఈ20ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరి ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ కేంద్రంలో ఈ ఇంజిన్‌ సముద్ర మట్టానికి సమాన ఎత్తులో 165 సెకండ్ల పాటు అవాంతరాలు లేకుండా మండించినట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో ప్రతిష్ఠాత్మక మానవ సహిత ఉపగ్రహం గగన్‌యాన్‌ను మోసుకెళ్లే వాహక నౌకలో ఈ ఇంజిన్‌ కీలకం. 22 టన్నుల ఇంధనాన్ని 165 సెకన్లలో మండించిన ఈ ఇంజిన్‌ను మరింత ఎక్కువ పేలోడ్‌లతో పరీక్షిస్తామని ఇస్రో వర్గాలు తెలిపాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram