బెపికొలంబో వ్యోమనౌక

బెపికొలంబో వ్యోమనౌక

రోదసిలో 8 ఏళ్ల ప్రయాణం తర్వాత బెపికొలంబో వ్యోమనౌక బుధుడి కక్ష్యలోకి ప్రవేశించింది. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ గ్రహం గురించి అనేక అంతుచిక్కని అంశాలను ఇది వెలుగులోకి తీసుకురానుంది. బెపికొలంబో అనేది రెండు రోబోటిక్‌ వ్యోమనౌకల సమాహారం. ఇందులో ఒకదాన్ని ఐరోపా, రెండోదాన్ని జపాన్‌ రూపొందించాయి. 2026, డిసెంబరులో ఇవి విడిపోనున్నాయి. ఆ తర్వాత బుధుడి ఉపరితలానికి భిన్న ఎత్తుల్లో ఉంటూ ఆ గ్రహాన్ని శోధిస్తాయి. ఈ ప్రాజెక్టు వ్యయం 200 కోట్ల డాలర్లు.

  • బుధ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించడానికి వీలుగా బెపికొలంబోలోని రాకెట్లను మండించారు. తద్వారా ఆ వ్యోమనౌక వేగం తగ్గి.. ఆ గ్రహ గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి వెళ్లిపోయింది. బుధ గ్రహాన్ని సందర్శించిన మూడో వ్యోమనౌక బెపికొలంబోగా నిలిచింది. ద]శాబ్ద కాలంలో ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram